Mon Mar 23 2026 16:21:08 GMT+0530 (India Standard Time)
గల్లా ట్వీట్ తో గురి చూసి కొట్టారే

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తన ట్వీట్ తో సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్, జగన్ సినిమా త్వరలో విడుదల కాబోతోందని, దీనికి ప్రశాంత్ కిషోర్ స్టోరీ, డైరెక్షన్ అని గల్లా ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల నిర్మాణ సారథ్యంలోనే ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోందని ఆయన ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ఇటీవల ట్వీట్ల ద్వారా టీడీపీని ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకే ట్వీట్ ద్వారానే గల్లా తన స్టయిల్ లో పవన్,జగన్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Next Story

