Wed Mar 25 2026 00:15:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గాలి అరెస్ట్

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబిడెంట్ ముడుపు కేసులో గాలి జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలి స్తున్న సయమంలో ఆయన నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గాలిని నిన్న సాయంత్రం నుంచి కొద్దిసేపటి వరకూ విచారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు గాలితో పాటు ఆయన అనుచరుడు ఆలీఖాన్ ను కూడా అరెస్ట్ చేశారు. గాలిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
లంచం ఇచ్చిన కేసులో....
అంబిడెంట్ కంపెనీ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గాలికి విక్టోరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. వారినుంచి సొమ్మును కూడా రికవరీ చేస్తామన్నారు పోలీసులు.
Next Story

