Tue Mar 24 2026 22:43:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లొంగిపోయిన గాలి

ఈడీ అధికారులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి అజ్ఞాతం వీడారు. ఇవాళ ఆయన బెంగళూరు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వద్దకు లాయర్ తో కలిసి వచ్చారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. తనకు నిన్ననే పోలీసుల నుంచి నోటీసులు అందాయని, ఇవాళ విచారణకు వచ్చానని తెలిపారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి గాలి జనార్థన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం గాలిని ఈడీ అధికారికి లంచం ఇచ్చిన కేసును విచారించనున్నారు.
Next Story

