Fri Dec 05 2025 21:43:05 GMT+0000 (Coordinated Universal Time)
గచ్చిబౌలి ప్లాట్ ధర 33 కోట్లు
గచ్చిబౌలిలోని ఓ కమర్షియల్ స్థలం గజం ధర 2 లక్షల 22 వేల రూపాయలు పలికింది.

గచ్చిబౌలిలోని ఓ కమర్షియల్ స్థలం గజం ధర 2 లక్షల 22 వేల రూపాయలు పలికింది. హైదరాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను నిర్వహించారు. గచ్చిబౌలిలో 4 స్థలాలను వేలం వేయగా, అన్నీ అమ్ముడుపోయాయి. ఆ ప్రాంతంలోని కుక్కలపార్కును ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం వేలంలో ఏకంగా 33 కోట్ల రూపాయలు పలికింది. గచ్చిబౌలిలోని భూముల అమ్మకం ద్వారా 55.56 కోట్ల రూపాయలు వచ్చాయి. కుత్బుల్లాపూర్ మండలం చింతల్లో ఎంజీఐ 10 స్థలాలలో 3 అమ్ముడుపోయాయి. వీటి ద్వారా సుమారు 8 కోట్ల ఆదాయం వచ్చింది. బాచుపల్లిలో 8 ప్లాట్లను వేలం వేయగా 4 అమ్ముడుపోయాయి. వేలం ద్వారా ప్రభుత్వానికి 65 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు.
Next Story

