Sat Jan 31 2026 12:47:39 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిలో ప్లేట్ల కోసం గొడవ...ఒకరి మృతి

పెళ్లికి వచ్చిన వారికి సరిపడా ప్లేట్లు లేకపోవడంతో అతిథులు నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ గొడవ పెద్దదిగా మారి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ బల్లియాలోని విక్రమ్ పూర్ ప్రాంతంలో జరిగింది. నాన్హు యాదవ్ అనే వ్యక్తి వివాహం ఘనంగా జరిగింది. అనంతరం విందు కూడా ఏర్పాటుచేశారు. ఇందుకు పెద్దసంఖ్యలో అతిథులు, బంధువులు హాజరయ్యారు. దీంతో భోజనం చేసేందుకు ప్లేట్లు సరిపోలేదు. ప్లేట్లు లేవని అతిథులు వివాహం జరిపిన వారితో గొడవకు దిగారు. దీంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వంటకు ఉపయోగించి గిన్నెలు, గరిటలతో కొట్టుకున్నారు. దీంతో ఐదురుగు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విశాల్ అనే 20 ఏళ్ల యువకుడు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించాడు.
Next Story

