Tue Mar 17 2026 06:20:16 GMT+0530 (India Standard Time)
మళ్లీ సూపర్ ఓవర్ లో ఇండియాదే గెలుపు
న్యూజిలాండ్, ఇండియాల మధ్య నాల్గో టీ 20 కూడా సూపర్ ఓవర్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా టై కావడంతో సూపర్ ఓవర్ ను నిర్వహించాల్సి [more]
న్యూజిలాండ్, ఇండియాల మధ్య నాల్గో టీ 20 కూడా సూపర్ ఓవర్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా టై కావడంతో సూపర్ ఓవర్ ను నిర్వహించాల్సి [more]

న్యూజిలాండ్, ఇండియాల మధ్య నాల్గో టీ 20 కూడా సూపర్ ఓవర్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ కూడా టై కావడంతో సూపర్ ఓవర్ ను నిర్వహించాల్సి వస్తోంది. టీం ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కూడా అదే స్కోర్ చేయడంతో మరోసారి సూపర్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఉత్కంఠ భరితంగా వెల్లింగ్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్ ఆరు బంతులకు 14 పరుగులు చేసింది. ఇండియా తరుపున కోహ్లి, రాహుల్ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు దిగారు. కోహ్లి ఫోర్ తో సూపర్ ఓవర్ లో ఇండియాను విజయం వరించింది. ఐదు బంతుల్లోనే ఇండియా ముగించింది.
Next Story

