Thu Mar 26 2026 01:08:19 GMT+0530 (India Standard Time)
నాలుగు గంటలు మోదీ....??

ప్రధాని నరేంద్ర మోదీ నేడు నాలుగు గంటల పాటు తెలంగాణాలో ఉంటున్నారు. ఆయన నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. నిన్నటి వరకూ అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. నేడు మోదీ రాకతో ఎన్నికల వేడి మరింత పెరగనుంది. మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాందేడ్ నుంచి బయలుదేరి మోదీ మరికాసేపట్లో నిజామాబాద్ కు చేరుకున్నారు. అక్కడి సభలో 45 నిమిషాలు ప్రసంగించిన అనంతరం ఆయన మహబూబ్ నగర్ కు వెళతారు. అక్కడ సభ పూర్తయిన తర్వాత తిరిగి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోతారు.
Next Story

