Mon Dec 15 2025 23:52:51 GMT+0000 (Coordinated Universal Time)
నేతి ఇడ్లీ కోసం వెంకయ్య నాయుడు
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. కేవలం నేతి ఇడ్లీని తినడం కోసమే ఆయన విజయవాడ వచ్చారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. కేవలం నేతి ఇడ్లీని తినడం కోసమే ఆయన విజయవాడ వచ్చారు. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ ఇడ్లీ సెంటర్లో వెంకయ్యనాయుడు అల్పాహారం తిన్నారు. మాజీమంత్రి కామినినేని శ్రీనివాస్ తో కలిసి నేతి ఇడ్లీని వెంకయ్యనాయుడు తిన్నారు. కేవలం తాను నేతి ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చానని తెలిపారు.
హోటల్ కు వచ్చి...
నాణ్యమైన ఇడ్లీ అంటూ హోటల్ యాజమాని కృష్ణప్రసాద్‌కు వెంకయ్య అభినందన తెలిపారు. పాక ఇడ్లీ అంటే తనకుకు చాలా ఇష్టమని, నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని వెంకయ్యనాయుడు తెలిపారు. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. యువతకు కూడా మన వంటకాలు చూపించి అలవాటు చేయాలని, అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమేనని, వ్యాయామం ఎంత ముఖ్యమో మన వంటలూ అంతే ముఖ్యమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
Next Story

