Fri Aug 12 2022 05:27:04 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ "చిరు ముచ్చట"

భీమవరంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి శాలువతో సన్మానించారు. మోదీ ఆయనను భుజంపై చేతుల వేసి కొద్దిసేపు ముచ్చటించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఈ సభకు ప్రత్యేకంగా వచ్చిన చిరంజీవికి వేదికపై చోటు కల్పించారు. సభ ప్రారంభానికి ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ చిరంజీవిని ప్రత్యేకంగా మోదీకి పరిచయం చేశారు.
శాలువతో సత్కరించి...
ప్రధాని మోదీ ప్రసంం ముగిసిన అనంతరం చిరంజీవి ప్రధాని మోదీని సత్కరించారు. చిరంజీవితో కొద్దిసేపు మోదీ మాట్లాడారు. తాను పుట్టిన ప్రాంతం కావడంతో పిలిచిన వెంటనే చిరంజీవి ఈ సభకు హాజరయ్యారు. మోదీ సభలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన సభ వేదికపై ప్రసంగించారు. మాజీ కేంద్ర మంత్రిగా ఆయనకు ఈ సభకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
Next Story