Thu Mar 19 2026 07:20:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి చెందారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి చెందారు. అనారోగ్యానికి గురికావడంతో రోశయ్యను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. లోబీపీ కావడంతో స్టార్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా రోశయ్య మృతి చెందారు. కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రోశయ్య ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉండేవారు.
ఆర్థికమంత్రిగా....
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికమంత్రిగా వైఎస్ హయాంలోనూ రోశయ్య పనిచేశారు. అనేక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకు దక్కుతుంది. తమిళనాడు గవర్నర్ గా కూడా రోశయ్య పనిచేశారు. రోశయ్య వయసు 88 సంవత్సరాలు.
Next Story

