Tue Jan 20 2026 18:30:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్…?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడినట్లే. మరో ఏడాదిన్నర వరకూ కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశం లేనట్లే కన్పిస్తుంది. దీనికి ప్రధాన కారణం జనగణన [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడినట్లే. మరో ఏడాదిన్నర వరకూ కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశం లేనట్లే కన్పిస్తుంది. దీనికి ప్రధాన కారణం జనగణన [more]

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడినట్లే. మరో ఏడాదిన్నర వరకూ కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశం లేనట్లే కన్పిస్తుంది. దీనికి ప్రధాన కారణం జనగణన జరగకపోవడమే. కరోనా కారణంగా జనగణన జరగలేదు. జనగణన పూర్తికానంతవరకూ మండలాలు, జిల్లాలను, సరిహద్దులను ఫ్రీజ్ చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో జనగణన పూర్తయ్యే అవకాశాలు లేవు. ఏపీలో 13 జిల్లాల నుంచి 26 జిల్లాలను చేయాలని జగన్ భావించారు. కానీ మరో ఏడాదిన్నర వరకూ అది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Next Story