Fri Mar 20 2026 00:48:48 GMT+0530 (India Standard Time)
ప్రపంచ కుబేరులు వీరే....!

ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితా అగ్రస్థానంలో నిలిచారు అమెజాన్ వ్యవస్థాపకులు, సీఈఓ జెఫ్ బెజోస్. గత సంవత్సరం కూడా ఈయనే తొలిస్థానంలో నిలిచారు. 141.9 బిలియన్ డాలర్లు ఆస్తి ఆయనకు ఉన్నట్లు ఫోర్డ్స్ ప్రకటించింది. ఇక 92.9 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ రెండో స్థానంలో, 82.2 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు. మొత్తం 100 పేర్లతో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్ జీ, లక్ష్మీ మిట్టల్, శివ నాడర్ లు ఉన్నారు.
Next Story

