Thu Mar 19 2026 01:44:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ పై ఉత్కంఠ

నిర్మల్ జిల్లా ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ నామినేషన్ పై ఉత్కంఠ నెలకొంది. నిన్నటి వరకు ఆమె 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల స్క్రూటినీ జరుగుతోంది. అయితే, రేఖానాయక్ దాఖలు చేసిన మూడు సెట్ల నామినేషన్లలోనూ ఒక్కో కాలమ్ ను ఖాళీగా వదిలేశారు. దీంతో ఆమె నామినేషన్ పరిశీలనకు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కి పంపించారు. అయితే, రేఖానాయక్ నామినేషన్ ను తిరస్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story

