Tue Mar 24 2026 23:38:17 GMT+0530 (India Standard Time)
నేడు దేశ వ్యాప్తంగా రహదారుల దిగ్బంధన
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. దాదాపు రెండు నెలలుగా రైతులు [more]
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. దాదాపు రెండు నెలలుగా రైతులు [more]

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. దాదాపు రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈరోజు జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ దిగ్భందం చేయాలని పిలుపునిచ్చారు. అత్యవసరసేవలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
Next Story