Sun Mar 15 2026 15:04:25 GMT+0530 (India Standard Time)
జగన్ పీఏ పేరుతో ఫేక్ కాల్స్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరుతో విదేశాల నుంచి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి సుమారు 15 మంది నేతలకు ఇటువంటి ఫోన్లు వచ్చాయి. సాంకేతికతను వినియోగించుకుని జగన్ పీఏ నెంబర్ డిస్ ప్లే అయ్యేలా ఈ ఫోన్లు వస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన వైసీపీ లీగల్ సెల్ నేతలు హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ కన్వీనర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... వై.ఎస్. జగన్ పై బురదజల్లేందుకే ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story

