Sun Dec 28 2025 02:22:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నేడు వైసీపీలో చేరనున్న ఇద్దరు మాజీ మంత్రులు
వైసీపీలో చేరికలు ఆగడం లేదు. టీడీపీ నుంచి వరసగా నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి శిద్ధారాఘవరావు, గాదె వెంకటరెడ్డిలు టీడీపీని వీడి వైసీపీలో [more]
వైసీపీలో చేరికలు ఆగడం లేదు. టీడీపీ నుంచి వరసగా నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి శిద్ధారాఘవరావు, గాదె వెంకటరెడ్డిలు టీడీపీని వీడి వైసీపీలో [more]

వైసీపీలో చేరికలు ఆగడం లేదు. టీడీపీ నుంచి వరసగా నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి శిద్ధారాఘవరావు, గాదె వెంకటరెడ్డిలు టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. శిద్ధా రాఘవరావు గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. గెదె వెంకటరెడ్డి గత ఎన్నికల్లో తన కుమారుడికి టిక్కెట్ కోసం బాపట్ల నియోజకవర్గంలో ప్రయత్నించి విఫలమయ్యారు. బాపట్ల నియోజవర్గం ఇన్ ఛార్జి పదవి కూడా తన కుమారుడికి ఇవ్వకపోవడంతో గాదె వెంకటరెడ్డి పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. శిద్ధా రాఘవరావు కూడా వ్యాపార ప్రయోజనాలు ఆశించి వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం.
Next Story