Mon Mar 23 2026 20:08:00 GMT+0530 (India Standard Time)
ప్రతిభా భారతికి గుండెపోటు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా వ్యవహరించిన ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల నుంచి టీడీపీ తరుపున పోటీచేసిన ప్రతిభాభారతి ఓడిపోయారు. ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య అస్వస్థతతో విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి శుక్రవారం వచ్చిన ప్రతిభా భారతి ఆందోళనకు గురై గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. కాగా వెంటనే బంధువులు అదే ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ప్రతిభా భారతిని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
Next Story

