Fri Mar 20 2026 07:03:30 GMT+0530 (India Standard Time)
వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారయణరెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నెల్లూరు నుంచి తన అనుచరులతో కలిసి వచ్చి విశాఖపట్నంలో కొనసాగుతున్న పార్టీ అధినేత జగన్ పాదయాత్ర స్థావరం వద్ద పార్టీలో చేరారు. జగన్ ఆనంతో పాటు ఆనం వివేకానంద రెడ్డి కుమారుగు రంగమయూర్ రెడ్డి, ఇతర నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు ఆనం కుటుంబం కూడా చేరడంతో రానున్న ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

