Sat Dec 06 2025 01:14:19 GMT+0000 (Coordinated Universal Time)
తనపై ఈ అసత్య ప్రచారం ఎందుకంటే?
తాను బ్రదర్ అనిల్ కుమార్ ను కలవలేదని మాజీ మంత్రి రాజయ్య తెలిపారు. కొందరు కావాలని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2019లో ఒక క్రైస్తవ [more]
తాను బ్రదర్ అనిల్ కుమార్ ను కలవలేదని మాజీ మంత్రి రాజయ్య తెలిపారు. కొందరు కావాలని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2019లో ఒక క్రైస్తవ [more]

తాను బ్రదర్ అనిల్ కుమార్ ను కలవలేదని మాజీ మంత్రి రాజయ్య తెలిపారు. కొందరు కావాలని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2019లో ఒక క్రైస్తవ మత సభ కోసం కలిసిన ఫొటోను ఇప్పుడు కొందరు వైరల్ చేశారని రాజయ్య తెలిపారు. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సత్సంబంధాలున్న మాట వాస్తవమేనని, వైఎస్ మరణం తర్వాత తాను టీఆర్ఎస్ లో చేరానని రాజయ్య తెలిపారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ లోనైనా, ఎదుగుదల మొత్తం కేసీఆర్ వల్లనేనని రాజయ్య తెలిపారు. కేసీఆర్ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవిచ్చారని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం కేసీఆర్ నిరంత శ్రమిస్తున్నారని రాజయ్య తెలిపారు.
Next Story