Mon Mar 16 2026 11:20:59 GMT+0530 (India Standard Time)
బీజేపీకి మరో షాక్… సీనియర్ నేత రాజీనామా
మాజీ మంత్రి పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ను ఆశించారు. అయితే ఈటల రాజేందర్ ను [more]
మాజీ మంత్రి పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ను ఆశించారు. అయితే ఈటల రాజేందర్ ను [more]

మాజీ మంత్రి పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ను ఆశించారు. అయితే ఈటల రాజేందర్ ను చేర్చుకోవడంతో గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికను పెద్దిరెడ్డి తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. పెద్దిరెడ్డి రాజీనామాతో బీజేపీ కి షాక్ తగిలిందనే చెప్పాలి. ఆయన త్వరలో టీఆర్ఎస్ లో చేరే అవకాశముంది.
Next Story