Sun Feb 01 2026 19:56:44 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను కలిసిన మాజీ మంత్రి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కలిశారు. గురువారం ఆనంను వైసీపీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు లోటస్పాండ్ కి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు జగన్తో రాంనారాయణరెడ్డి చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆనం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Next Story

