Sun Feb 01 2026 11:35:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాగుంట మహిధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు మహీధర్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మహిధర్ రెడ్డి రాకతో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయన ప్రభావం నాలుగైదు జిల్లాల్లో ఉండే అవకాశముంది.
Next Story

