Thu Mar 19 2026 18:18:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైఎస్సార్సీపీలోకి మాజీ డీజీపీ..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో ఆంధ్ర ప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు భేటీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా రాంబల్లి మండలం హరిపురంలో జగన్ పాదయాత్రలో ఆయన జగన్ ను కలిశారు. గతంలో ఆయన డీజీపీగా, ఏసీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. అయితే, సాంబశివరావు త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి సాంబశివరావు వ్యక్తిగత కారణాలతో జగన్ ను కలిశారా? పార్టీలోచేరేందుకే ఆయన వద్దకు వచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది.

Next Story

