Sat Mar 07 2026 16:15:04 GMT+0530 (India Standard Time)
‘ఎన్టీఆర్ బయోపిక్’ టీమ్ కి నాదెండ్ల వార్నింగ్
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర బృందానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో తనను నెగటివ్ [more]
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర బృందానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో తనను నెగటివ్ [more]

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర బృందానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో తనను నెగటివ్ చూపించే అవకాశం ఉందని, ఇప్పటికే చిత్ర బృందానికి నోటీసులు పంపించినట్లు ఆయన తెలిపారు. తన పాత్రను నెగటీవ్ గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయాలపై ఆయన స్పందిస్తూ… రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో వైరం పెంచుకోవడం మంచిది కాదన్నారు. రాష్ట్రానికి కావాల్సిన సాయాన్ని సంయమనంతో సాధించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంతో వైరం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Next Story