Tue Jan 13 2026 16:23:13 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ గూటికి మాజీ కేంద్రమంత్రి
త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన మంగళవారం ఢిల్లీలో [more]
త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన మంగళవారం ఢిల్లీలో [more]

త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… త్వరలో టీడీపీలో చేరతానని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేదానిపై ఇంకా చర్చించలేదని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అరకు లోక్సభ స్థానానికి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.
Next Story