Mon Jun 27 2022 06:01:54 GMT+0000 (Coordinated Universal Time)
నమ్మకస్థుడికి మళ్లీ స్థానం

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అధినేత కేసీఆర్ వెన్నంటే ఉంటున్న ఈటెల రాజేందర్ కు మరోసారి మంత్రి పదవి దక్కింది. ఆయన ఉప ఎన్నికలతో కలిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు ఆయన శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కీలక స్థానంలో కొనసాగారు. గత ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖమంత్రిగ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్యాబినెట్ లో ఈటెల రాజేందర్ కు మొదటి విడతలో మంత్రి పదవి దక్కే అవకాశం లేదని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో నిన్న రాత్రి ఆలస్యంగా ఆయనకు ప్రమాణస్వీకారానికి సిద్ధం కావాల్సిందిగా ఫోన్ వచ్చింది. ఈసారి ఆయన ఆర్థిక శాఖ కాకుండా సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Next Story