తెలంగాణలో ఐదుగురికి ఎఫెక్ట్.. వారంతా విదేశీయులే
తెలంగాణలో ఇప్పటి వరకూ ఐదు కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే ఈ ఐదుగురు కూడా విదేశాల [more]
తెలంగాణలో ఇప్పటి వరకూ ఐదు కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే ఈ ఐదుగురు కూడా విదేశాల [more]

తెలంగాణలో ఇప్పటి వరకూ ఐదు కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే ఈ ఐదుగురు కూడా విదేశాల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. తెలంగాణ వాసులెవరికీ ఇంతవరకూ కరోనా సోకలేదని తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సామగ్రిని కూడా కొనుగోలు చేశామని చెప్పారు. కరోనా కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వస్తున్న వారికి ఖచ్చితంగా పరీక్షలు జరుపుతున్నామని తెలిపారు. 24 గంటలూ నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారికే ఈ వ్యాధి సోకిందని ఈటల రాజేందర్ తెలిపారు. ఇకపై కరోనా పై ప్రతి రోజూ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు.

