Sun Mar 15 2026 21:27:11 GMT+0530 (India Standard Time)
మోత్కుపల్లి ఆరోపణలపై ఈటల ఏమన్నారంటే?
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. తాను [more]
సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. తాను [more]

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. తాను ఒక్క ఎకరం భూమిని ఆక్రమించుకున్నా ముక్కును నేలకేసి రాస్తానని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కేసీఆర్ సూచనలతోనే కొందరు వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై చేసిన చిల్లర ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని ఈటల రాజేందర్ అన్నారు. కిరాయి మనుషులకు డబ్బులిచ్చి చిల్లర ఆరోపణలు చేయించడం మానుకోవాలని కేసీఆర్ కు ఈటల రాజేందర్ హితవు పలికారు.
Next Story