Mon Mar 16 2026 10:15:44 GMT+0530 (India Standard Time)
చిరకాల కోరిక నెరవేరింది
వరంగల్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మొదటి సారి మంత్రి పదవి దక్కింది. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి [more]
వరంగల్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మొదటి సారి మంత్రి పదవి దక్కింది. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి [more]

వరంగల్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మొదటి సారి మంత్రి పదవి దక్కింది. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఆయనకు ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి చేపట్టాలనేది ఆయన చిరకాల కోరిక. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. ఆయనకు హామీ ఇచ్చినట్లుగా కేసీఆర్ ఈ క్యాబినెట్ లో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆయనకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Next Story