Sat Dec 13 2025 09:00:28 GMT+0000 (Coordinated Universal Time)
ఈటలను కలసిన మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్త నేతలు మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ అయిన ఈటల రాజేందర్ ను కలుస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి [more]
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్త నేతలు మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ అయిన ఈటల రాజేందర్ ను కలుస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి [more]

తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్త నేతలు మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ అయిన ఈటల రాజేందర్ ను కలుస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటల రాజేందర్ ను కలవడం చర్చనీయాంశమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో ఓటమి పాలయ్యారు ఏనుగు రవీందర్ రెడ్డి. అయితే తనపై గెలిచిన జాజుల సురేందర్ ను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో ఈయన అసంతృప్తితో ఉన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి టీఆర్ఎస్ లో తనకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్న అనుమానంతోనే ఆయన ఈటల రాజేందర్ ను కలిసినట్లు తెలిసింది.
Next Story