Sun Mar 22 2026 10:21:15 GMT+0530 (India Standard Time)
వివాదంలో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఎన్నికల కమిషన్ ఆయనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం కల్గిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలోని మర్కల్ గ్రామాలో మహిళాసంఘాలకు ఐదు లక్షల వరకూ రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీల వీడియోను విపక్షాలు ఎన్నికల సంఘానికి సమర్పించాయి. మహిళలను ప్రలోభాలకు ఏనుగు రవీందర్ రెడ్డి గురిచేశారని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన వీడియో ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల సంఘం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను విచారణకు ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏనుగు రవీందర్ రెడ్డిపై తహశిల్లార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story

