Tue Feb 03 2026 21:39:25 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని భూములపై ఈడీ అధికారులు?
రాజధాని భూములపై ఈడీ దర్యాప్తు ప్రారంభమయింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయాని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసిన సంగతి [more]
రాజధాని భూములపై ఈడీ దర్యాప్తు ప్రారంభమయింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయాని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసిన సంగతి [more]

రాజధాని భూములపై ఈడీ దర్యాప్తు ప్రారంభమయింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయాని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా 700 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుతో కొనుగోలు చేసిన భూములపై ఈడీ విచారణ జరపనుంది. ఈ మేరకు సీఐడీ నుంచి వివరాలను సేకరించింది. సీఐడీ తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, సీఆర్డీఏ నుంచి కూడా వివరాలను సేకరిస్తున్నారు. దాదాపు 5,500 ఎకరాలను టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో అక్రమంగా కొనుగోలు చేశారని మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.
Next Story