Fri Mar 20 2026 03:00:29 GMT+0530 (India Standard Time)
పంచాయతీలకు మళ్లీ ఎన్నికలు.. 15న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మరో 12 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు వేయని [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో 12 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు వేయని [more]

ఆంధ్రప్రదేశ్ లో మరో 12 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో తిరిగి ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీన పోలింగ్ నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. 15వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.
Next Story