Sun Mar 22 2026 11:53:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణ పోలింగ్ డిసెంబరు 7న

తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. సెప్టంబరు 6వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో తెలంగాణకు కూడా ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలయింది. అయితే తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు డిసెంబరు 7న పోలింగ్ జరగనుంది. ఒకే దశలో పోలింగ్ ను నిర్వహించనున్నారు. డిసెంబరు 11న కౌంటింగ్ జరుగుతుంది. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఒకే దశలో తెలంగాణ లో పోలింగ్ నిర్వహించనున్నారు.
Next Story

