Sat May 04 2024 06:23:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణ షెడ్యూల్ విడుదలవుతుందా?
ఎన్నికల కమిషన్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం పెడుతుంది. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. మధ్యప్రదే్శ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబరు రెండోవారంలో ఎన్నికలు ఉండే అవకాశముందని తెలిసింది. అయితే తెలంగాణలో కూడా ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ రాష్ట్రానికి కూడా నోటిఫికేషన్ నేడు విడుదలవుతుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల జాబితా అంశం ఇంకా తెలంగాణలో ఒక కొలిక్కి రాకపోవడంతో మరికొంత సమయం తీసుకుంటారా? అన్న సందేహం కలుగుతుంది. దీంతో తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారులతో పాటు సాంకేతిక నిపుణులతో కూడా చర్చించి ఎన్నికల కమిషన్ తెలంగాణ షెడ్యూల్ విడుదల చేయనుందని తెలుస్తోంది. మధ్యాహ్నం మూడుగంటలకు ఎన్నికల కమిషన్ దీనిపై స్పష్టత ఉంది.
Next Story