Wed Mar 18 2026 17:57:20 GMT+0530 (India Standard Time)
ఓటుకు నోటు కేసు: ఈడీ విచారణకు రేవంత్
ఓటుకు నోటు కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నామినేటెడ్ [more]
ఓటుకు నోటు కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నామినేటెడ్ [more]

ఓటుకు నోటు కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ.50 లక్షలకు సంబంధించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డి, రేవంత్ అనుచరుడు ఉదయసింహను ఈడీ అధికారులు సుదీర్ఘ విచారణ చేశారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ.50 లక్షల గుట్టు ఈ విచారణలో తేలే అవకాశం ఉంది.
Next Story