Fri Mar 27 2026 17:34:42 GMT+0530 (India Standard Time)
ఈ ఫ్లైఓవర్ పై అనుమతి లేదు
దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. ఈరోజు నుంచి ఫ్లై ఓవర్ పై రాకపోకలు ఉంటాయని కేశినేని నాని ట్వీట్ చేశారు. అయితే ఈరోజు [more]
దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. ఈరోజు నుంచి ఫ్లై ఓవర్ పై రాకపోకలు ఉంటాయని కేశినేని నాని ట్వీట్ చేశారు. అయితే ఈరోజు [more]

దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. ఈరోజు నుంచి ఫ్లై ఓవర్ పై రాకపోకలు ఉంటాయని కేశినేని నాని ట్వీట్ చేశారు. అయితే ఈరోజు ఫ్లై ఓవర్ పై రాకపోకలను అనుమతించడం లేదని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే ఎప్పుడు రాకపోకలకు అనుమతిస్తారన్నది ఆర్ అంబ్ బి అధికారులు నిర్ణయిస్తారని కలెక్టర్ తెలిపారు. దీంతో ఈరోజు నుంచి దుర్గగుడి ఫ్లైఓవర్ పై రాకపోకలు ఉంటాయని భావించిన విజయవాడ ప్రజలు నిరాశకు గురయ్యారు.
Next Story