Fri Mar 20 2026 09:16:52 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ సభపై డీఎస్ కుమారుడి వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన ప్రగతి నివేదన సభ పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. సభ విఫలమైనందున ఆయన టీఆర్ఎస్ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. 25 లక్షల మంది సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ చెబితే సభకు కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో కారు అడ్డంగా బోల్తా కొడుతుందని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 20 సీట్ల కంటే ఎక్కువ గెలవదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇస్తవా, చస్తవా అనే అంత సీన్ కేసీఆర్ కి లేదని ఆయన అన్నారు.
Next Story

