Fri Jan 30 2026 19:27:18 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లలను అతి కిరాతకంగా....?

పసి పిల్లలను హత్య చేసి మృతదేహాలను తరలిస్తుండగా దొరికిపోయారు నిందితులు. మానసిక వికలాంగులైన ఇద్దరు కవల పిల్లలను దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. హైదరాబాద్ లోని చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురంలో మిర్యాలగూడకు చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మి నివాసముంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సృజన, విష్ణువర్థన రెడ్డి. ఇద్దరూ మానసిక వికలాంగులే. ఎప్పుడూ అనారోగ్యం ఉండటం, ఆర్థికంగా చితికిపోవడంతో మేనమామ మల్లికార్జునరెడ్డి పథకం పన్నాడు. ఈ పిల్లలను చంపేస్తే సోదరి, బావ సుఖంగా ఉంటారని భావించి హత్యకు పాల్పడ్డాడు. ఇద్దరిని హత్య చేసి కారులో తరలిస్తుండగా స్థానికులు చూసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లల మేనమామ మల్లికార్జునరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story
