Fri Jan 30 2026 13:02:15 GMT+0000 (Coordinated Universal Time)
వీడు వైద్యుడు కాదు...రాక్షసుడు

వైద్యుడు దేవుడితో సమానం అంటారు. కానీ, చికిత్స కోసం వచ్చిన మహిళను రేప్ చేసి బెదిరిస్తున్నాడు. వీడు మాత్రం కచ్చితంగా రాక్షసుడే. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా కైతోరా గ్రామంలో సంవత్సరం క్రితం చికిత్స కోసం ఓ మహిళ సాజిద్ హసన్ అనే వైద్యుడి వద్దకు వెళ్లింది. మహిళపై కన్నేసిన అతడు మత్తుమందు ఇచ్చి ఆమెను రేప్ చేసి, వీడియో తీశాడు. అప్పటి నుంచి వీడియో బయటపెడతానని భయపెట్టిస్తూ సదరు మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విసుగు చెందిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story

