Mon Mar 23 2026 15:27:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న వైద్యులు

హైదరాబాద్ చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు జూబ్లీహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స జరుపుతున్నారు. జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తికి విషం పూసి ఉండవచ్చనే అనుమానాలు ఉండటంతో వైద్యులు జగన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు. ఆయన భుజానికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కత్తితో శ్రీనివాస్ అనే యవకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే భుజానికి గాయం లోతుగా తగలడంతో కుట్లు వేయాలని వైద్యులు చెబుతున్నారు.
Next Story

