నేను ఒక అయస్కాంతాన్ని: డి. కె. శివ కుమార్

ఇటీవల కర్ణాటక శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్ , జె డి ఎస్ శాసనసభ్యులని తమ పార్టీల చేజారకుండా చూడటం తో బాటు, వారి తో వివిధ ప్రాంతలలో క్యాంపు రాజకీయాలు నడిపి యూదియారప్ప ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి కె శివ కుమార్ తనకు తాను అయాస్కాంతుం గా అభివర్ణించు కున్నాడు. యూదియారప్పను గద్దె దించడంతో, శివ కుమార్ పార్టీ పెద్దల మన్ననలను అందుకుంటన్నారు.
వోటింగ్ రోజున ఉదయం కనపడకుండ పోయిన ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు, చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో జతకలవాడనికి కారణం అయస్కాంతం లాంటి తన వ్యక్తిత్వమే కారణమని, తన ఈ స్వభావమే అందరి శాసనసభ్యులని చేజారకుండా కట్టి ఉంచటానికి ఉపయోగపడిందన్నారు.
కొసమెరుపు: శివ కుమార్ ఇంత ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, అతనిని ఉప ముఖ్యమంత్రిగా నియమించడానికి కుమారస్వామి ససేమిరా అంటున్నారు, ఇందుకు ప్రధాన కారణం, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారే గాక, శివ కుమార్ ఆర్థికంగా బలంగా ఉండటమే ప్రధాన కారణం. వీరి ఇద్దరి మధ్య శత్రుత్వం బహిరంగ రహస్యమే.
- Tags
- amit shah
- bharatiya janatha party
- bjp
- D.K.Shiva kumar
- indian national congress
- karnataka elections
- kumara swamy
- narendra modi
- rahul gandhi
- siddharamaiah
- Vajubhai vala
- yudhiyarappa
- అమిత్ షా
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- కర్ణాటక ఎన్నికలు
- కుమార స్వామి
- డి. కె. శివ కుమార్
- నరేంద్ర మోడీ
- భారతీయ జనతా పార్టీ యూదియారప్ప
- రాహుల్ గాంధీ
- వాజుభాయ్ వాలా
