Fri Dec 19 2025 19:04:33 GMT+0000 (Coordinated Universal Time)
అనువాదంలో అరుణమ్మ తిప్పలు

గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ నాయకురాలు డీ.కే.అరుణ చిక్కులు కొని తెచ్చుకున్నారు. సోమవారం జరిగిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి డీకే అరుణ అనువాదం చేయడానికి ముందుకొచ్చారు. అయితే, అనువాదంలో పలుమార్లు ఇబ్బంది పడ్డారు. రాహుల్ గాంధీ హిందీలో పలు అంకెలు చెబుతున్నప్పుడు డీకే అరుణ చెప్పలేకపోయారు. కొన్నింటిని డీకే అరుణ సరిగ్గా అనువాదం చేయలేకపోయారు. చివరకు ధన్యవాదాలు చెప్పే సమయంలోనూ ఆమె రాహుల్ వ్యాఖ్యలను అందుకోలేకపోయారు. దీంతో ఓ దశలో రాహుల్ గాంధీ కొంత అసహనానికి గురైనా వెంటనే నవ్వుతూ మళ్లీ చెప్పారు. మొత్తానికి హిందీ బాగా తెలిసిన నేతలకు అనువాద బాధ్యత అప్పగించి సభ బాధ్యతలు చూసుకుంటే పోయేదానికి డీకే అరుణ అనవసరం పని నెత్తినెత్తుకుని తిప్పలు పడాల్సి వచ్చింది.
Next Story

