Sat Mar 07 2026 21:57:10 GMT+0530 (India Standard Time)
రాళ్లదాడిపై ఎటువంటి ఆధారాలు లభించలేదు
తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఐజీ క్రాంతి రాణా తెలిపారు. రాళ్లదాడిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసినట్లు [more]
తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఐజీ క్రాంతి రాణా తెలిపారు. రాళ్లదాడిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసినట్లు [more]

తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఐజీ క్రాంతి రాణా తెలిపారు. రాళ్లదాడిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులను విచారించామని చెప్పారు. సీసీ, మొబైల్, మీడియా ఫుటేజ్ లను కూడా పరిశీలించామని, అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని క్రాంతి రాణా తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
Next Story