Thu Mar 19 2026 01:44:07 GMT+0530 (India Standard Time)
సంజయ్ అరెస్ట్

సీనియర్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న కేసులో ధర్మపురి సంజయ్ గత కొంతకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో నిజామాబాద్ పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు సంజయ్ కు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇచ్చారు. దీంతో సంజయ్ ఈరోజు నిజామాబాద్ పోలీసుల ఎదుట హాజయరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తర్వాత విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
Next Story

