Thu Feb 13 2025 10:04:29 GMT+0000 (Coordinated Universal Time)
శాంతిభద్రతలపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లతో [more]
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లతో [more]

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లతో భేటీ అయ్యారు. తర్వాత జగన్ ను నూతన డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. రేపు ఆయన డీజీపీగా బాధ్యతలు తీసుకోనుండగా ఇవాళ జగన్ ను కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ డీజీపీకి సూచించారు. అయితే, త్వరలోనే కొందరు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story