Thu Mar 19 2026 10:58:59 GMT+0530 (India Standard Time)
జగన్ బంధువుల అక్రమ దోపిడీ
అక్రమ మైనింగ్ ద్వారా వందల కోట్లు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కొనసాగుతుందని [more]
అక్రమ మైనింగ్ ద్వారా వందల కోట్లు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కొనసాగుతుందని [more]

అక్రమ మైనింగ్ ద్వారా వందల కోట్లు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కొనసాగుతుందని ఆయన అన్నారు. అటవీ చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. అక్రమంగా విలువైన చెట్లను కూడా నరికివేశారని దేవినేని ఉమ ఆరోపించారు. లక్షల టన్నుల గ్రావెల్ ను తరలించారని అన్నారు. జగన్ బంధువులు, ,వైసీపీ నేతలు ఈ దోపిడీకి పాల్పడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
Next Story