Mon Mar 16 2026 09:22:00 GMT+0530 (India Standard Time)
వాట్సప్ తో వంశీ నాన్సెన్స్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ తన రాజీనామా లేఖను ఫోన్ లో పంపారని, అది [more]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ తన రాజీనామా లేఖను ఫోన్ లో పంపారని, అది [more]

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ తన రాజీనామా లేఖను ఫోన్ లో పంపారని, అది నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని వ్యంగంగా అన్నారు. వల్లభనేని వంశీ మూడు రోజుల్లో ముగ్గురు పార్టీల నేతలను కలిశారని దేవినేని ఉమ అన్నారు. రేపు చంద్రబాబును కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. వాట్సప్ మెసేజ్ లతో నాన్సెన్స్ ఏంటని ఉమ మండిపడ్డారు. వంశీ రాజీనామా చేయాలనుకుంటే నేరుగా స్పీకర్ ఫార్మాట్ లో ఆయనకే పంపాలని, చంద్రబాబుకు ఎందుకు పంపారని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Next Story