Tue Mar 24 2026 00:06:02 GMT+0530 (India Standard Time)
వసూల్ కింగ్ మంత్రి ఉమ

మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. దేవినేని ఉమ చంద్రబాబుకు దోచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉమ వసూలు చేసి చంద్రబాబుకు ఇస్తారని, అందులో నుంచి కొంత కమీషన్ తీసుకుంటారని జగన్ ఆరోపించారు. పోలవరం నుంచి పట్టిసీమ వరకూ అన్నీ కమీషన్లు దండుకుని ఉమ, చంద్రబాబులు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని విమర్శించారు. అవినీతిలో దేవినేని ఉమకు వాటా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకునేందుకు ఏకంగా 23, 62 నెంబర్లున్న జీవోలను తెచ్చారని జగన్ చెప్పారు. పట్టిసీమలో అడ్డంగా దోచుకున్నారని కాగ్ నివేదికలు బయటపెట్టినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Next Story

