Sun Mar 15 2026 18:17:10 GMT+0530 (India Standard Time)
కేసీఆర్, నవీన్ పట్నాయక్ తో జగన్ కుమ్మక్కు

పోలవరం ప్రాజెక్టు ఆపేందుకు పక్క రాష్ట్రాల వారు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని అనుకుంటున్నారని ఆరోపంచారు. కేసీఆర్ కుమార్తె కవిత పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారన్నారు. కేసీఆర్ విశాఖపట్నం వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్వాగత, సత్కారాలు ఏర్పాటుచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం నిర్మించి తీరతామన్నారు. ఒక్కరోజే భారీగా కాంక్రీటు వేసిన ఘనత పోలవరం ప్రాజెక్టుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
Next Story

